బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్‌రెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. సీనియర్ వరల్డ్ ఛాంపియన్స్ పోటీల్లో ఆడేందుకు పోలాండ్ పర్యటిస్తున్న సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు కొంతకాలం సుధాకర్ రెడ్డి కోచ్‌గా వ్యవహరించారు. సుధాకర్ అకాల మృతికి భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. బ్యాడ్మింటన్ రంగానికి తీరని లోటుని పేర్కొంది.
ఇదీచదవండి