అయ్యప్ప దీక్ష చేపట్టిన వల్లభనేని వంశీ... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గొల్లపూడి అయ్యప్పస్వామి భక్త కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వంశీ వ్యవహారం ఉందని ఆక్షేపించింది. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకంగా మారారని కమిటీ విమర్శించింది. ఆయన తీరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులకు తప్పుడు సంకేతాలు పంపుతోందని... ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని... మాలాధారణ సమయంలో రాజకీయాలు మానుకోవాలని ఆ కమిటీ సూచించింది.
ఇదీ చదవండి:ఆయన మాటలతో నాకు బీపీ పెరిగింది: వంశీ