ETV Bharat / city

'ముఖ్యమంత్రి జగన్​ది ఇల్లా.. మాయా మహలా?... చిన్న పనులకు రూ. 4 కోట్లా?' - సీఎం జగన్​పై అయ్యన్నపాత్రుడు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ప్రజాధనంతో వృథా ఖర్చులు చేయడం మాని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ayyanna patrudu budda venkanna fires on cm jagan
సీఎం జగన్​పై తెదేపా నేతల విమర్శలు
author img

By

Published : Jul 12, 2020, 2:48 PM IST

ayyanna patrudu tweets
అయ్యన్నపాత్రుడు ట్వీట్స్

ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రాజభవనాల సోకులకు.. రాష్ట్ర బడ్జెట్ సరిపోవడం లేదని.. తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందే నిర్మాణం పూర్తయిందన్న ఇంటికి.. ఇప్పుడు కరెంట్ పనికి, సోఫాలు, కుర్చీలకు రూ. 4 కోట్ల రూపాయలు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు.

అది ఇల్లా, మాయా మహలా అంటూ మండిపడ్డారు. రంగులు, హంగులు, సోకులకు ప్రజా ధనం వృథా చేయడం మాని.. సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజాధనంతో దుబారా ఖర్చు చేయడం సీఎం జగన్​కు సబబు కాదన్నారు. ఈ విషయంపై అయ్యన్నపాత్రుడు ఓ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: ఈవో అనిల్​ సింఘాల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.