విశాఖలో జరుగుతున్న అనర్థాలకు మూలం విజయసాయిరెడ్డేనని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని ఇటీవల ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. నోటీసులు వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను జనవాసాల నుంచి తరలించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట మీద ఉండాలని పిలుపునిచ్చారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర ఉత్పత్తి లేని ఎల్జీ పాలిమర్స్ ప్రారంభానికి అనుమతులు ఎలా ఇచ్చారో కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.