ETV Bharat / city

'జీవో 21 అమలైతే కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది..' - ఆటో యూనియన్​

జీఓ నెంబర్ 21తో ఆటో రవాణా రంగంపై విధించే అపరాధ రుసుము 10 నుంచి 20 రెట్లు పెరిగే అవకాశం ఉందని విజయవాడలోని ఆటో కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కార్మికులపై భారం మోపే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్​ చేశారు. ఈ జీవో అమలైతే కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

auto workers round table meet in vijayawada
ఆటో కార్మిక సంఘాల ఐక్య వేదిక
author img

By

Published : Jan 11, 2021, 7:06 PM IST

ఆటో రవాణా రంగంపై పెను భారాలు మోపే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని కోరుతూ ఆటో కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆటో రవాణా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెను భారాలు మోపేందుకు సిద్ధం అయ్యిందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టానికి సవరణలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ సవరణలు అమలు చేసేందుకు జీవో నెంబర్ 21ని విడుదల చేసిందన్నారు. ఈ జీవో అమలైతే ఆటో రవాణా రంగాలపై విధించే అపరాధ రుసుము 10 నుంచి 20 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఆటో రవాణా రంగం సంక్షోభంలో ఉందని.. ఈ జీవో అమలైతే కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీవోని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అప్పటికి దిగిరాకపోతే ఆటో సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఉద్యోగాల కోసం 22ఏళ్లుగా డీఎస్సీ అభ్యర్థుల పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.