తెదేపా కార్యాలయం(attack on tdp office)పై దాడి ఘటనలో.. వైకాపాకు చెందిన 70 మంది కార్యకర్తలపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి.. రిసెప్షన్ కమిటీ చైర్మన్ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా.. ఈ కార్యాలయంలో తనపై జరిగిన దాడి గురించి, కార్యాలయ సిబ్బంది బద్రి ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. బద్రి తల పగలగొట్టినప్పటికీ.. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని తెదేపా నేతలు ఆరోపించారు.
అసలేం జరిగింది..
మంగళగిరి సమీపంలో, డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గర్లో ఉన్న తెదేపా జాతీయ కార్యాలయంపై పదుల సంఖ్యలో దుండగులు విరుచుకుపడి విశృంఖలంగా దాడికి పాల్పడ్డ సంగతి తెెలిసిందే. ఈ ఘటనలో.. పార్టీ నాయకుడు దొరబాబుతోపాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బంది తీవ్రంగా గాయపరిచారు.
అయితే.. ఈ దాడిని ముందే పసిగట్టిన తెదేపా కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినా.. పోలీసులు స్పందించలేదని నాయకులు ఆరోపించారు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఇంత బీభత్సం జరుగుతున్నా.. పోలీసులు రాలేదు. చేయాల్సిన విధ్వంసమంతా చేసి, అల్లరిమూకలు తీరిగ్గా వాహనాలు ఎక్కి వెళ్లిపోయాక అప్పుడు పోలీసులు వచ్చారు. ఈ ఘటనపైనే.. తెదేపా ఇవాళ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: