ఆత్రేయ సినీ వేమన అని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం అన్నారు. ఆయన ఒక విశ్వకవి అని, వట వృక్షమని కొనియాడారు. మేధావిలా ఆలోచించి సామాన్యుని కోసం అనేక పాటలు రాశారని పేర్కొన్నారు. పైడిపాల రాసిన "ఆత్రేయ సాహితీ, ఆత్రేయ సినీ గేయ సర్వస్వం" అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఫీనిక్స్ ఎరీనాలో(Atreya Sahithi book launch event at Madhapur) జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఆత్రేయను అందరూ హేతువాదంటారనీ, కానీ.. ఆయనో అద్భుతమైన ఫిలాసఫర్ని తెలిపారు. "మనసు గతిఇంతే మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే" అని ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారని(Atreya Cine Geya Sarvaswam book) పేర్కొన్నారు. అత్యద్భుతమైన రచన చేశారని తెలిపారు. 1,636 పాటలు రాయడం మాటలు కాదన్నారు. ప్రేమ గురించి... ప్రేమికులు ఎలా ఉండాలో ఆ రోజుల్లోనే ఆయన చెప్పారని పేర్కొన్నారు.
ఆయన మాటలు నేటి సమాజానికీ ఉపయోగపడుతున్నాయని బ్రహ్మానందం(brahmanandam news) అన్నారు. "కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిదానా" పాట విన్న తరువాత ఆత్రేయను మించిన కమ్యూనిస్టు కవి ఎవరున్నారనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో (Atreya Sahithi book launch event) సినీ గేయ కవి సుద్దాల అశోక్ తేజ, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Chandrababu letter to CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు...చంద్రబాబు లేఖ