గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలపై దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతకు స్థలం అమ్మలేదన్న నెపంతో దుకాణాన్ని కూల్చడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం, వేధింపులకు పాల్పడటంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'విద్వేషం, విధ్వంసమే వైకాపా అజెండా' అని ఆయన ధ్వజమెత్తారు.
అన్యాయన్ని ప్రశ్నించిన తెదేపా నేతలపై దాడి, అక్రమ కేసులు బనాయించడంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మారణాయుధాలు, రాళ్లతో దాడి చేసిన వైకాపా నేతలపై కేసులు పెట్టరా..? అని పోలీసులను నిలధీశారు. బాధితులకు అండగా నిలిస్తే కేసులు పెడతారా? అని ధ్వజమెత్తిన ఆయన.. అధికారమదంతో వైకాపా నేతలు నరరూప రాక్షసుల్లా మారారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: వైకాపా- తెదేపా శ్రేణుల మధ్య తోపులాట... పరిస్థితి ఉద్రిక్తం