ETV Bharat / city

ASP's Promoted To SP: రాష్ట్రంలో 9 మంది ఏఎస్పీలకు నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతి - ఏఎస్పీలకు నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతి

ASP's Promoted To SP: రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ఏఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఏఎస్పీలకు వారు పనిచేస్తున్న చోటే పదోన్నతులు కల్పించగా..మరికొందరికి స్థానం చలనం చేస్తూ పదోన్నతి కల్పించారు.

9 మంది ఏఎస్పీలకు నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతి

author img

By

Published : Dec 6, 2021, 10:37 PM IST

ASP's Promoted To SP: రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ఏఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నగరంలో ఏఎస్పీ ట్రాఫిక్​గా ఉన్న కె.బాబూరావుకు డీసీపీ ట్రాఫిక్​గా పదోన్నతి కల్పించారు. అదనపు ఎస్పీ విజిలెన్స్​గా ఉన్న కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డి అదే స్థానంలో ఎస్పీ విజిలెన్స్ నాన్ కేడర్​గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో ఏఎస్పీ పి.బిజోయోకు నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రవిచంద్రకు ఆక్టోపస్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఇంటెలిజెన్స్ ఏఎస్పీ జగన్నాథరెడ్డికి ఎస్పీ నాన్​ కేడర్​గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వెయిటింగ్​లో ఉన్న జి.నాగన్నకు పదోన్నతి కల్పిస్తూ హెడ్ క్వార్టర్స్​లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్ ఏఎస్పీ యూ.రవిప్రకాశ్​కు నాన్ కేడర్ ఎస్పీగా అక్కడే పదోన్నతి కల్పించారు. ఇక గుంటూరు గ్రామీణ ఏఎస్పీ ఎన్వీఎస్ మూర్తిని ఇంటెలిజెన్స్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. ఇంటెలిజెన్స్ ఏఎస్పీ రఘువీరారెడ్డికి అదే స్థానంలో ఎస్పీ నాన్ కేడర్​గా పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి

CM Jagan On Paddy Crop: అక్కడ వరికి బదులు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.