విజయవాడ లెనిన్ కూడలి వద్ద ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు ఆందోళనకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయంలో ఆశావర్కర్లను కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.
ప్రతి 1000 నుంచి 1500 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‌ను కేటాయించాలన్నారు. ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు.
ఇదీ చదవండి: