ETV Bharat / city

'ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా... గెలిపించండి'

మార్చిలో జరిగే ఎన్నికల్లో తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎయస్ రామకృష్ణ.. ఉపాధ్యాయులను కోరారు. ఐదున్నరేళ్లుగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశానని పేర్కొన్నారు.

author img

By

Published : Oct 6, 2020, 5:32 PM IST

AS RamaKrishna to be contest in MLC Elections in March
'మార్చిలో జరిగే ఎన్నికల్లోనూ నన్నే ఎమ్మెల్సీగా గెలిపించండి'

ఎమ్మెల్సీగా గత ఐదున్నరేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేశానని ఏయస్ రామకృష్ణ అన్నారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ సహకారంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫిట్​మెంట్ 42 శాతానికి పెంచడానికి కృషి చేశానన్నారు.

ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 1వ తేదీన జీతం అందేలా కృషి చేశానని.. బదిలీల సమస్యలను పరిష్కరించానని వివరించారు. మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జరగబోతున్నాయని... తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు చెప్పిన ఆయన.. గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి:

మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.