Chintamani natakam ban : చింతామణి నాటకం నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగు దండు సంస్థ ఆధ్వర్యంలో విశాఖ తెలుగుతల్లి విగ్రహం కూడలి వద్ద నిరసన చేపట్టారు. మహా నాటక రచయిత కాళ్లకూరి నారాయణరావు వందేళ్ల క్రితం సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు రచించిన చింతామణి నాటకాన్ని నిషేధించడం దారుణమని తెలుగు దండు సంస్థ వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయన సూరి ఆవేదన వ్యక్తం చేశారు. నాటకంలో అశ్లీల పదజాలం వినియోగిస్తే వాటిని తొలగించాలి కానీ.. నాటకం మొత్తం నిషేధించటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తాము నష్టపోతున్నారమని కళాకారులు వాపోయారు. ప్రభుత్వం.. కళాకారులతో సంప్రదించి నాటకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని జబర్దస్త్ నటుడు అప్పారావు విజ్ఞప్తి చేశారు.
బూతు భాషను, మద్యపానాన్ని రద్దు చేయాలి కానీ..
సామాజిక రుగ్మతలను పారద్రోలి ప్రజల్లో చైతన్యం నింపిన నాటకాలు, కళాకారుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం, తెలుగు సాహితీ, సంస్కృతిని, కవులను అవమానించేలా ఉందని తెలుగు సాహిత్య సంఘం అధ్యక్షులు కుమార్ ఆరోపించారు. అసెంబ్లీలో నాయకులు మాట్లాడే బూతు భాషను, సమాజానికి కీడు చేస్తున్న మద్యపానాన్ని రద్దు చేయాలి కానీ.. ఇలాంటివి వదిలి సమాజాన్ని జాగృతి పరిచే చింతామణి వంటి నాటకాలను రద్దు చేయడం సరి కాదన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం చింతామణి నాటక ప్రదర్శన నిషేదించారన్నారు. కళాకారుల పట్ల సానుభూతి లేకపోయినా పర్లేదు కానీ.. ఎంతో గొప్పచరిత్ర ఉన్న నాటకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు.
ఇదీ చదవండి
చింతామణి నాటకంపై నిషేధం.. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల ఆందోళనలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!