ETV Bharat / city

Mahanadu: మహానాడు ఏర్పాట్లు.. భవిష్యత్‌ వ్యూహాలపై స్పష్టత ఇవ్వనున్న అధినేత

TDP Mahanadu Arrangements: తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే వరుస భేటీలు నిర్వహించిన మహానాడు కమిటీలు.. అజెండాతో పాటు తీర్మానాలకు తుదిరూపు ఇచ్చాయి. రెండు రోజుల మహానాడు కార్యక్రమం వేదికగా భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు, కార్యకర్తలకు అధిష్ఠానం మార్గనిర్దేశం చేయనుంది. ఒంగోలు సమీపంలో ఈ నెల 27, 28తేదీల్లో మహానాడు జరగనుంది.

Mahanadu Arrangements
Mahanadu Arrangements
author img

By

Published : May 18, 2022, 4:41 AM IST

Telugudesam Mahanadu: ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని త్రోవగుంట ప్రాంతంలోని మండవారిపాలెంలో ఈ నెల 27, 28తేదీల్లో నిర్వహించే మహానాడుకు తెలుగుదేశం కసరత్తు ముమ్మరమైంది. వేడుక నిర్వహించే ప్రదేశంలో ఇవాళ భూమిపూజ చేసి వేదిక నిర్మాణంతో పాటు మిగిలిన ఏర్పాట్లును లాంఛనంగా ప్రారంభిస్తారు. మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై నేతలు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనందబాబు, టీడీ జనార్ధన్‌ చర్చించారు. మహానాడులో సుమారు 17 తీర్మానాలు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో ఏపీకి చెందినవి 14, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు మూడు ఉన్నాయి.

మూడేళ్ల వైకాపా పాలనలో ప్రజలపై మోపిన భారాలు, ఆర్థిక సంక్షోభం, కరెంటు కోతలు, మహిళలపై అరాచకాల వంటి అనేక అంశాలపై మహానాడులో చర్చించనున్నట్లు సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రానికి మూడేళ్లలో వైకాపా చేసిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించి.... ఆయన స్ఫూర్తిని రాబోయే తరాలకు అందిస్తామని నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. భవిష్యత్‌ పోరాట పంథాతో పాటు రాజకీయ వ్యూహాలపై మహానాడు వేదికగా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చదవండి: ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎం జగన్‌కు అర్థమైంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.