ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా.. రేపటి నుంచి మూడో దశ కొవిడ్ వ్యాక్సినేషన్ - మూడోదశ కొవిడ్ టీకా పంపిణీ

మూడో దశ కొవిడ్ టీకా పంపిణీలో భాగంగా సోమవారం నుంచి 60 ఏళ్లు దాటిన వారితో పాటు మధ్య వయసున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్‌ టీకా పంపిణీపై మంగళగిరిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశమైంది.

arrangements for distribution of covid vaccination
మూడోదశలో 60 ఏళ్లు దాటిన వాళ్లకు వ్యాక్సినేషన్
author img

By

Published : Feb 28, 2021, 8:07 AM IST

రాష్ట్రంలో సోమవారం నుంచి 60 ఏళ్లు దాటిన వారితో పాటు.. 45- 59 సంవత్సరాల (దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు) మధ్య వయసున్న వారికి కొవిడ్‌ టీకా పంపిణీకి వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మూడోదశలో భాగంగా ఉప ఆరోగ్యకేంద్రాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీకా ఇవ్వబోతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లోనూ టీకా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొవిన్‌ 2.0 యాప్‌లో శనివారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మ్యాపింగ్‌ జరుగుతోంది. మొత్తం 2,222 టీకా కేంద్రాల వివరాలు యాప్‌లో ఉంటాయి. ఈ యాప్‌ ద్వారా అర్హులు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు సోమవారం నుంచి అవకాశం కల్పించనున్నారు. యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవడం తెలియని వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సాయం అందించేలా వైద్యారోగ్య ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు వార్డు సచివాలయ సిబ్బంది సహకారం కోసం ఆయా శాఖలను కోరింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోకున్నా పుట్టిన తేదీ ఉండే కార్డు, దీర్ఘకాలిక వ్యాధులున్నట్లు వైద్యులిచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించి టీకా పొందొచ్చు. అయితే అక్కడ ముందస్తుగా స్లాట్‌ పొందినవారు తక్కువగా ఉంటేనే నేరుగా వచ్చేవారికి టీకాకు అవకాశం కల్పిస్తారు.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో టీకా ఖరీదు రూ.150, సర్వీసు ఛార్జీ మరో రూ.100 కలిపి మొత్తం రూ.250 తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులకూ వైద్యారోగ్యశాఖే టీకా సరఫరా చేస్తోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలు టీకా వేసేందుకు ముందుకొస్తాయా..? లేదా..? ఆరోగ్యశ్రీ ట్రస్టుతో జరిగే ఒప్పందం ఎలా ఉండాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక వయల్‌తో 10 మందికి టీకా ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియలో టీకా వృథా కాకుండా అధికారులు ప్రత్యేకదృష్టి పెట్టారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీకా తరలించేందుకు 26 వాహనాలను ఉపయోగిస్తున్నారు. అదనంగా మరో 52 వాహనాలను వినియోగించనున్నారు. పీహెచ్‌సీల వరకూ టీకా తరలింపునకు మ్యాపింగ్‌ చేస్తున్నారు. మొత్తం 17,715 మంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల జాబితా ప్రస్తుతం కొవిన్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్‌సైట్‌లోనూ ఉన్నాయి.

టాస్క్‌ఫోర్స్‌ భేటీ

కొవిడ్‌ టీకా పంపిణీపై మంగళగిరిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, మహిళా, శిశు సంక్షేమం, ఇతర శాఖల అధికారులతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ శనివారం సమావేశమైంది. సోమవారం నుంచి చేపట్టాల్సిన టీకా రిజిస్ట్రేషన్‌, పంపిణీపై చర్చించింది. సమావేశంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ భాస్కర్‌, ప్రజారోగ్య శాఖ సంచాలకులు గీతా ప్రసాదిని, సీనియర్‌ అధికారులు రవిచంద్ర, రాఘవేంద్రరావు, రామకృష్ణారావు, దేవి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఈశాన్యం నుంచి వేడిగాలులు..రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.