విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సాయుధ దళాలు భారతీయులందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందాయన్నారు. రక్షణ సిబ్బంది శౌర్యం, విధి పట్ల భక్తి, వారి వృత్తి నైపుణ్యానికి వందనం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని గవర్నర్ పేర్కొన్నారు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలు మరువలేనివన్నారు. పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల నుంచి ఎక్కువ మొత్తం విరాళాలు సేకరించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌లను అభినందించారు. అనంతరం HDFC బ్యాంక్ నిర్వహించిన 13వ వార్షిక రక్తదాన డ్రైవ్‌ను గవర్నర్ ప్రారంభించారు.
ఇవీ చదవండి..