ETV Bharat / city

తెలంగాణలో 1.61 లక్షల కిలో మీటర్లు తిప్పటానికి మేం రెడీ ! - ఇరు రాష్ట్రాల మధ్యబస్సులు

తెలంగాణ ఆర్టీసీ పట్టుబడుతున్నట్లుగా ఆ రాష్ట్ర పరిధిలో రోజూ..లక్ష 61వేల కిలోమీటర్ల మేర మాత్రమే సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్​ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఏపీ ప్రతిపాదనతో తెలుగురాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీబస్సు సర్వీసులు తిప్పుకునేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.

తెలంగాణలో 1.61 లక్షల కిలో మీటర్లే తిప్పుతాం

author img

By

Published : Oct 10, 2020, 4:41 AM IST

తెలంగాణ ఆర్టీసీ పట్టుబడుతున్నట్లుగా ఆ రాష్ట్ర పరిధిలో రోజూ..లక్ష 61వేల కిలోమీటర్ల మేర మాత్రమే సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్​ఆర్టీసీ సిద్ధమవుతోంది. నిత్యం లక్షా 4 వేల కిలోమీటర్ల మేర సర్వీసులు తగ్గించుకోనుంది. లాక్‌డౌన్‌ ముందు వరకు తెలంగాణ పరిధిలో ఏపీఎస్​ఆర్టీసీ రోజు 2లక్షల 65వేల కిలోమీటర్లు, తెలంగాణ ఆర్టీసీ ఏపీ పరిధిలో లక్షా 61వేల కిలోమీటర్ల మేర బస్సు సర్వీసులు నడిపేవి. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం తర్వాత ఇరురాష్ట్రాల మధ్య సర్వీసులు పునరుద్ధరణకు అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాల్సిందేనని టీఎస్​ఆర్టీసీ కోరుతోంది.

ఇందులో భాగంగా ఇరు ఆర్టీసీలు రోజూ లక్షా 61వేల కిలోమీటర్ల చొప్పునే నడపాలని షరతు విధించింది. ఇటీవల ఏపీఎస్​ఆర్టీసీ అధికారులు 2లక్షల 8వేల కిలోమీటర్ల చొప్పున బస్సులు నడిపేందుకు ప్రతిపాదించినప్పటికీ తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. చివరకు ఏపీఎస్​ఆర్టీసీ అధికారులు లక్షా 61వేల కిలోమీటర్ల ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు ఉంటాయనే జాబితా సిద్ధం చేస్తున్నారు. తాజా ప్రతిపాదనలతో ఏపీఎస్​ఆర్టీసీ అధికారులు వచ్చే సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లో టీఎస్​ఆర్టీసీ అధికారులతో భేటీ కానున్నారు. ఏపీ ప్రతిపాదనతో తెలుగురాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీబస్సు సర్వీసులు తిప్పుకునేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.

ఇదీచదవండి

మన్ను తింటున్న గోవులు.. ఎక్కడో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.