ఆర్టీసీలో పొరుగు సేవల సిబ్బంది ఉచిత ప్రయాణానికి బస్సు పాసులు ఇవ్వాలని సంస్థ ఎండీ కృష్ణబాబు నిర్ణయం తీసుకున్నారు. 5 వేల మంది సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. జనవరి 1 నుంచి పొరుగుసేవల సిబ్బందికి ఉచిత బస్సు పాసులు ఇస్తామని కృష్ణబాబు తెలిపారు. ఉద్యోగి నివాసం నుంచి కార్యాలయం వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. 25 కిలోమీటర్లలోపు ప్రయాణానికి ఇది వర్తిస్తుందని వివరించారు. అన్ని డిపో మేనేజర్లు, యూనిట్ ఆఫీసర్స్ ద్వారా పాసుల జారీ చేస్తామన్న కృష్ణబాబు... వీటిని దుర్వినియోగం చేయరాదని సిబ్బందికి సూచించారు.
ఇదీ చదవండి