ETV Bharat / city

మమ్మల్ని కరుణించరా..? కారుణ్య నియామకాలకోసం ఆర్టీసీ బాధిత కుటుంబాల ఆందోళన

ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ శాఖల్లో పనిచేసే ఉద్యోగి విధినిర్వహణలో మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా ఆయా సంస్థలదే(Compassionate Appointments act). కుటుంబంలో ఒకరికి కొలువిచ్చి వారిని కాపాడాలి. కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీలో మాత్రం ఈ విధానం కనిపించడం లేదు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల కారుణ్యం చూపడం(No Compassionate Appointments in apsrtc) లేదు. ఫలితంగా వందలాది ఉద్యోగుల కుటుంబాలు కష్టాలతో జీవనం సాగిస్తున్నాయి.

author img

By

Published : Nov 1, 2021, 4:53 PM IST

Compassionate Appointments in apsrtc
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ధర్నా
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని రోడ్డెక్కిన బాధిత కుటుంబాలు

ఈ ఆవేదన ఒక్కరిద్దరిది కాదు.. వేల మందిది. కారుణ్య నియామకాల(Compassionate Appointments in apsrtc) కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచుస్తున్నారు. కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కరుణించని పరిస్థితి నెలకొంది. వీరిలో ఆర్టీసీ సంస్థ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యోగుల పిల్లలు కొందరైతే.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు మరికొందరు ఉన్నారు. ప్రయాణికుల కోసం ప్రాణాలు పణంగా పెట్టి అసువులు బాసిన ఉద్యోగుల వారసులూ ఉన్నారు. రోజులు.. వారాలు... నెలలు .. సంవత్సరాలు గడిచినా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ వీరి ఆవేదన, ఆక్రందన పట్టించుకునే నాథుడే లేరు.

ఆర్టీసీ ఉద్యోగం అంటే అంత సులువు కాదు..
ఏపీఎస్​ఆర్టీసీ(APSRTC)లో ఉద్యోగం చేయడమంటే అంత సులువేమీ కాదు. ఎన్నో ప్రయాసాలకోర్చి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అధిక పని గంటలు విధులు నిర్వహించడం, ఒత్తిళ్లు కారణంగా గుండె, మూత్రపిండాలు, నరాలకు సంబంధించి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలతో ఉద్యోగులు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయి.

నష్టాల సాకుతో నిలిపివేత..
సంస్థలో సిబ్బంది ఎవరైనా చనిపోతే వెంటనే కుటుంబంలో అర్హత ఉన్నవారికి ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎప్పటి కప్పుడు నిరంతరం కారుణ్య నియామకాలను చేపట్టి బాధితులకు అండగా నిలబడాలి. ఆర్టీసీ (artc)లో మాత్రం అలా జరగడం లేదు. నష్టాలు, కరోనా పేరు చెబుతూ 2016 నుంచి కారుణ్య నియామకాలు(Compassionate Appointments in apsrtc) చేపట్టకుండా నిలిపివేసింది. మానవతా దృక్పథంతో వెంటనే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

కొవిడ్​తో చనిపోయిన వారి కుటుంబాలకే నియామకాలు..
చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని న్యాయపోరాటం చేయగా.. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అందరికీ ఉద్యోగాలొస్తాయనుకున్నారు. ఆ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. కేవలం కొవిడ్​తో చనిపోయిన వారి కుటుంబాలకే ప్రభుత్వం కారుణ్య నియామకాలను పరిమితం చేసింది. దీంతో మరోసారి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని బాధితులు వాపోతున్నారు(Concerns for compassionate appointments in trc).

ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే..
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైనందున కారుణ్య నియామకాల(protest for karunya niyamakalu in apsrtc)కు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని యాజమాన్యం చెబుతోంది. బాధితుల వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాలంటోంది.

ఇదీ చదవండి..

NOTIFICATION : రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.