రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 1నుంచి.. 50 కిలోల పార్శిళ్లను కూడా ఇళ్లకు చేరవేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ కార్గో మేనేజర్ షేక్ అజ్మతుల్లా తెలిపారు. కార్గో సేవల్లో భాగంగా ఇప్పటివరకు పది కిలోల వరకు పార్శిళ్లను మాత్రమే ఇళ్లకు చేరవేశామని, ఇప్పుడు 50 కిలోలకు పెంచామని వివరించారు.
రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, రాజమహేంద్రవరంలో డోర్ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కిలోకు రూ.18, కిలో నుంచి 6 కిలోలకు రూ. 30, ఆరు నుంచి పది కిలోలకు రూ. 36, పది నుంచి 25 కిలోలకు రూ. 48, ఇరవై ఐదు నుంచి 50 కిలోలకు రూ. 59 ఛార్జి చేస్తామని తెలిపారు. ఈ సౌకర్యం హైదరాబాద్ నుంచి కూడా కొనసాగిస్తామని అజ్మతుల్లా తెలిపారు.
ఇదీ చదవండి: Apsrtc: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలు