ETV Bharat / city

APPSC: ఉద్యోగాల భర్తీకి.. ప్రాథమిక పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ప్రాథమిక పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ

APPSC Exam Dates Released:రాష్ట్రంలోని రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి ప్రాథమిక పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ప్రకటించారు. జూలై 24న దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జూలై 31న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్రీనింగ్​ పరీక్ష నిర్వహించనున్నారు.

appsc Exam Dates Released
appsc Exam Dates Released
author img

By

Published : May 31, 2022, 10:48 PM IST

APPSC Exam Dates: రాష్ట్రంలో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం జూలైలో ప్రాథమిక పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రాథమిక పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ప్రకటించారు. జూలై 24న దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష, జులై 31న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లను త్వరలో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్​ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు.

రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న ఏపీపీఎస్సీ ప్రకటనలు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్‌ సెలక్షన్ కమిటీ నియామకాలు చేపట్టనుంది. దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడంతో వడపోత కోసం స్క్రీనింగ్ పరీక్షను పెట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష విధానాన్ని పక్కన పెట్టి ఈ రెండు పరీక్షలనూ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.