ఆన్లైన్లో ఆప్కో వస్త్రాలు విక్రయించేందుకు ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆప్కో బ్రాండ్ ద్వారా చేనేత వస్తువుల విక్రయాలను ప్రోత్సహించాలన్నది తమ లక్ష్యమన్నారు. సచివాలయంలో అమెజాన్ వెబ్సైట్ ద్వారా ఆప్కో విక్రయాలను ఆయన ప్రారంభించారు. అమెజాన్ నుంచి ఆప్కో బ్రాండ్ ద్వారా జరిగే విక్రయాలకు సంబంధించిన లాభాలను చేనేతలకు బదిలీ అవుతాయన్నారు.
మొత్తం 104 ఉత్పత్తులు ప్రస్తుతం అమెజాన్‌కు ఆప్కో ద్వారా విక్రయించామని వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్త్రాలు ఇక అమెజాన్ ద్వారా దేశ విదేశాలకు చేరుతాయన్నారు. రాజమండ్రి, బందరు, మాధవవరం, వెంకటగిరి కాటన్ చీరలతో పాటు పొందూరు ఖాదీ దోవతులు, చీరాల, సత్తెనపల్లి, ఇసుకపల్లి వస్త్రాలు ఇక అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. ఇప్పటికే కొందరు మాస్టర్ వీవర్లు అమెజాన్‌తో వ్యక్తిగతంగా ఒప్పందాలు చేసుకున్నప్పటికీ .. ఆప్కో బ్రాండ్ ద్వారా విక్రయించటం వల్ల వినియోగదారుల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నారు.
ఇదీ చదవండి