ETV Bharat / city

AP MRPS Rashtra Sadassu at Vijayawada: 'ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్​ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి' - AP news

AP MRPS Rashtra Sadassu at Vijayawada: విజయవాడలో మాదిగల మేథోమదన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్​.. తన చిత్తశుద్ధి చూపాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

AP MRPS Rashtra Sadassu at Vijayawada
మేథోమదన రాష్ట్ర సదస్సు
author img

By

Published : Nov 30, 2021, 5:21 PM IST

AP MRPS Rashtra Sadassu at Vijayawada: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్​.. తన చిత్తశుద్ధి చూపాలని, వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వర్గీకరణ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తూ.. సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్​ను నియమించాలన్నారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన మాదిగల మేథోమదన రాష్ట్ర సదస్సులో వెంకటేశ్వరరావు అన్నారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేయడం తగదన్నారు.

జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగల పట్ల వివక్ష చూపుతోందన్న ఆయన.. మాదిగలకు సామాజిక న్యాయం చేయనందుకే గత ప్రభుత్వాన్ని ఓడించామని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం.. తన పద్థతి మార్చుకోకపోతే లక్షమంది మాదిగలతో సభ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రకటిస్తామని హెచ్చరించారు. లిడ్ కాప్​ను మాదిగ చర్మకార సంస్థగా ప్రకటించడం, కృష్ణపట్నం తోళ్ల పరిశ్రమలో పనులు వెంటనే ప్రారంభించాలని, మూసివేసిన ఎయిడెడ్ స్కూల్సును ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదంవడి..: CJI Justice NV Ramana tributes to Dollar Seshadri: 'డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.