ETV Bharat / city

Tulasi Reddy : జగన్ ది 'మందు' చూపు ప్రభుత్వం - తులసి రెడ్డి

author img

By

Published : Oct 14, 2021, 6:38 PM IST

జగన్ ప్రభుత్వానికి 'మందు' చూపు తప్ప.. ముందు చూపు లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్న ఆయన.. కమీషన్ల కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

PCC Working President Tulasi Reddy
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి

జగన్ ప్రభుత్వానికి 'మందు' చూపు తప్ప.. ముందు చూపు లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణలోని జూరాల ప్రాజెక్టును కృష్ణా బోర్డు తన పరిధిలోకి తీసుకోకుంటే.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు.

కృష్ణాబోర్డు కార్యాలయాన్ని తక్షణం తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు తరలించే విధంగా.. కృష్ణాబోర్డు పై ఒత్తిడి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ను కొనుగోలు చేసి.. ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కడప జిల్లాలోని థర్మల్ పవర్ ప్లాంట్ ను, కృష్ణపట్నంలోని థర్మల్ పవర్ ప్లాంట్ ను దాదాపు ఏడాదిన్నరపాటు ప్రభుత్వం మూసివేసిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం విద్యుత్ కు డిమాండ్ పెరగడంతో.. పరిస్థితి తలకిందులైందని అన్నారు. గతంలో.. యూనిట్ ను రూ. 2.60 పైసలకు కొన్న ప్రభుత్వం.. నేడు యూనిట్ ను రూ. 20కి కొనాల్సి వస్తోందని అన్నారు. ఈ భారం రాబోయే రోజుల్లో మళ్ళీ వినియోగదారులపైనే మోపక తప్పదని తులసి రెడ్డి అన్నారు.

పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై స్పందిస్తూ.. ఇందులో కొత్తదనమేదీ లేదని చెప్పారు. భారత్ మాల, సాగర మాల, ఉడాన్, రైల్వే నెట్వర్క్, ఇన్లాండ్ వాటర్ వేస్, భారత్ నెట్ వర్క్.. వీటన్నింటినీ కలిపి "పీఎమ్ గతిశక్తి" అని నామకరణం చేశారే తప్ప.. ఇందులో కొత్త విషయం ఏదీ లేదని అన్నారు తులసి రెడ్డి.

ఇదీ చదవండి : అలాగైతే.. రాష్ట్ర ప్రజలు డీజీపీకి నోటీసులివ్వాలి: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.