ETV Bharat / city

వైకాపా మాట తప్పే మడమ తిప్పే పార్టీ: తులసి రెడ్డి - tulasi reddy

వైకాపా నేతలు.. ప్రభుత్వం ఏర్పడక ముందు ఓ మాట, తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం, రుణాలపై వైకాపా మాట తప్పిందన్నారు.

వైకాపా మాట తప్పే...మడమ తిప్పే పార్టీ : తులసి రెడ్డి
author img

By

Published : Jul 27, 2019, 5:28 PM IST

వైకాపా మాట తప్పే...మడమ తిప్పే పార్టీ : తులసి రెడ్డి

వైకాపా ప్రభుత్వానికి మాట తప్పడం, మడమ తిప్పడం దినచర్యగా మారిందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామని జగన్ మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.6,500 మాత్రమే ఇస్తామని, మిగతా రూ.6 వేలు కేంద్రం ఇస్తుందని అంటున్నారన్నారు. వ్యవసాయ రుణాలపై సున్నా వడ్డీ అని జగన్ హామీ ఇచ్చి సీఎం అయ్యాక... రూ3,500 కోట్లు ఇస్తామని, బడ్జెట్​లో‌ కేవలం‌ వంద కోట్లు కేటాయించారని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ప్రతిపక్ష‌ నేతగా ఉన్నప్పుడు విమర్శించిన జగన్... ప్రాజెక్టులను ఆపేయాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. సీఎం అయ్యాక మాటమార్చి కేసీఆర్​పై పొగడ్తలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇరవై మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంపై పోరాడి హక్కులను సాధిస్తామన్న వైకాపా... ఇప్పుడు వేచి చూడక తప్పదంటూ నిట్టూర్పులు వదులుతున్నారన్నారు. మద్యపాన నిషేధం మూడు దశల్లో అన్న జగన్ ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందని చట్టాలు చేస్తున్నారని తులసి రెడ్డి ఆరోపించారు. 55 రోజుల జగన్ పాలనలో ప్రజలకు ఒరింగిందేమీ లేదన్నారు.

ఇదీ చదవండి : 2024 ఎన్నికలే లక్ష్యంగా.. జనంలోకి జనసేన

Intro:Ap_Vsp_91_27_Wine_Bar_Shop_Workers_Agitation_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) నూతన మద్యం పాలసీ వలన వేలాది మంది కార్మికులు ఉపాధిని కొల్పవాల్సి వస్తుందంటూ విశాఖలో మద్యం, బార్ దుకాణాలలో పనిచేసే సిబ్బంది నిరసన చేపట్టారు.

Body:జీవియంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ వైన్స్ అండ్ బార్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అన్ని మద్యం మరియు బార్ దుకాణాలలో పనిచేసే సిబ్బంది మొత్తం ఈ నిరసనలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

Conclusion:నూతన మద్యం పాలసీ విధానం ద్వారా పెట్టె దుకాణాలలో విద్య, వయోపరిమితి లేకుండా ప్రస్తుతం ఉన్న కార్మికులనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నవారిని తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డునపడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.