'కరోనా మహమ్మారి - ప్రజలు - ప్రభుత్వం' అనే అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో నిష్ణాతుల సలహాలను ప్రభుత్వం తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రజలే ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు ప్రకటనలతో ప్రజల్ని మోసం చేస్తున్నాయన్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!