శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతాల్లో ఉవ్వెత్తున లేస్తున్న అలలు
శ్రీకాకుళం జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ నివాస్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఆంధ్రప్రదేశ్ వాతావరణం
15:38 October 12
14:03 October 12
మరింత బలపడిన వాయుగుండం
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం
- ఉత్తర కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు
- కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు
- తీరప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
11:37 October 12
మరికొద్ది గంటల్లో తీవ్రవాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం..ఈ రాత్రిలోగా తీవ్రవాయుగుండంగా మారనుంది. పశ్చిమ వాయవ్యదిశగా పయనించి రేపు ఉదయం నరసాపురం-విశాఖ మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చని..రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి తీవ్ర భారీ వర్షాలు పడవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
10:26 October 12
12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారనుంది: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
- పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారనుంది: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
- పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రేపు ఉదయం తీరం దాటే అవకాశం
- నరసాపురం-విశాఖ మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం
- ఉత్తర అండమాన్ సముద్రంలో ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- ఇవాళ ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
- రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి తీవ్ర భారీ వర్ష సూచన
- రేపు రాయలసీమలో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్ష సూచన
- తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం
- మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు
08:50 October 12
విశాఖలో అధికారులు అప్రమత్తం.. తీర ప్రాంత మండలాల్లోని పరిస్థితులపై సమీక్ష
- విశాఖలో భారీగా ఈదురుగాలులు, ఎడతెరపి లేని వర్షం
- గాజువాకలోని మిలిటరీ కాలనీ, హరిజనజగ్గయ్యపాలెం నీటమునక
- గాజువాక షీలానగర్ మధ్య పలు ప్రాంతాల్లో భారీగా చేరిన వర్షపు నీరు
- సిందియా గణపతి నగర్‌లో ఓ ఇంటిపై కూలిన కొండచరియ
- సిందియా గణపతినగర్‌లో కొండచరియ ఇంటిపై పడి తల్లీబిడ్డ మృతి
- విశాఖ: సహాయక చర్యలు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది
- విశాఖ: అధికారులతో ఫోనులో మాట్లాడిన కలెక్టర్ వినయ్‌చంద్
- విశాఖ కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నం. 0891–2590102, 0891-2590100
- విశాఖ: ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశం
- తీర ప్రాంత మండలాల్లోని అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశం
- రోడ్లపై చెట్లు పడిన వెంటనే తొలగింపునకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశం
08:47 October 12
కడప జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు..పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన రాకపోకలు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కడప జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలచేశారు. బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. పది రోజుల క్రితం.. బుగ్గవంకలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. రాకపోకలు నిలిపేశారు.
08:24 October 12
విశాఖలో కుండపోత వర్షం..
- విశాఖలో ఎడతెరపి లేని వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
- విశాఖ: వర్షానికి పూర్తిగా నీటమునిగిన హరిజన జగ్గయ్యపాలెం
06:46 October 12
కృష్ణా జిల్లాలో అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- అల్పపీడన ద్రోణి కారణంగా రేపటివరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- కృష్ణా జిల్లాలో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
- టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు
- కృష్ణా జిల్లాలో అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు: కలెక్టర్
- లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి సహకరించాలి: కలెక్టర్
- విజయవాడలోని కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నం. 0866 – 2474805
- విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం. 0866-2574454
- మచిలీపట్నం కంట్రోల్ రూమ్ నం. 08672-252572
- నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం. 08656- 232717
- మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నం. 08672-252486
- గుడివాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నం. 08674 – 243697
06:10 October 12
ఏపీలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. అది పశ్చిమ వాయువ్యంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి.. రాత్రికి నరసాపురం-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆ శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని తెలిపారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల 20 సెంటిమీటర్లు, అంతకుమించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రత్యేకించి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాలని యంత్రాంగానికి హెచ్చరికలు జారీచేశారు. తీరంలోని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు.. మత్య్సకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల14న ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా చెప్పారు.