రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కరోనా కట్టడిని గాలికొదిలేసి.. అనవసర వివాదాల చుట్టూ తిరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబూరావు విమర్శించారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రజలకు, వైద్య సిబ్బందికి కోడిగుడ్లు, అరటి పళ్ళు పంపిణీ చేశారు. సైద్ధాంతిక రాజకీయాలకు, పోరాట పటిమకు, సేవాతత్పరత, నీతికి, నిజాయితీకి కామ్రేడ్ సుందరయ్య మారుపేరని కొనియాడారు.
ప్రతిరోజు అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా పరస్పర విమర్శలతోనే కాలక్షేపం చేస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఇంటింటికి అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పంచారనీ.. నేడు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. సుందరయ్య స్ఫూర్తితో సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగులను కాపాడటానికి ఐసోలేషన్ కేంద్రాలను నడుపుతూ ప్రజలకు వీలైనంత సేవలు అందిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: