విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి అత్యున్నత గుర్తింపు లభించింది. నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ISO) రెండోసారి సర్టిఫికెట్ ఇచ్చింది. విమానాశ్రయం మేనేజర్ జి. మధుసూధన రావును కలిసిన ప్రతినిధులు జ్ఞాపిక అందజేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం సహా భద్రత, అగ్నిమాపక నిరోధక వ్యవస్థ, సౌకర్యాలు వంటివి పరిశీలించిన తర్వాత ఐఎస్‌ఓ 9001 2015 ధ్రువ పత్రాన్ని అందజేశారు. గతేడాదీ విమానాశ్రయానికి ఐఎస్‌ఓ ధ్రువపపత్రం లభించింది. గత డిసెంబర్ నుంచి అంతర్జాతీయ విమానసేవలు ప్రారంభం కాగా... దేశీయంగా 9 నగరాలకు విమాన సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు. సేవల నాణ్యత పెంచారు. ప్లాస్టిక్ నివారించి పర్యావరణహితమైన విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. పలుమార్లు సర్వేలైన్స్ ఆడిట్ నిర్వహించిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం వరుసగా రెండో ఏడాది ధ్రువపత్రాన్ని అందజేశారు. గుర్తింపుపై సంతోషం వ్యక్తం చేసిన విమానాశ్రయ డైరెక్టర్ జి . మధుసూధనరావు... విమానాశ్రయంలో మరింత మెరుగైన సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి...