- "చంద్రబాబు దిల్లీ వెళ్తే... తాడేపల్లిలో వణుకు మొదలైంది"
చంద్రబాబు దిల్లీ వెళ్తే... తాడేపల్లిలో వణుకు మొదలైందని తెదేపా నేతలు ఎద్దేవా చేశారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై సీఎం జగన్ మౌనం వీడాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తనను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
- పనిగట్టుకొని ప్రచారం.. పవన్ పార్టీ మారతారా? - బాలినేని
తాను జనసేనలోకి వెళుతున్నట్టు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చేనేతకు తాము ఎంతో చేశామని, అందుకే పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు స్పందించానని చెప్పారు.
- Nara Lokesh:వర్సిటీలను వైకాపా కార్యాలయాలుగా మార్చేశారు: నారా లోకేశ్
వర్సిటీలను జగన్ వైకాపా కార్యాలయాలుగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. వేధింపులతో ఉద్యోగి రాజీనామా... అరాచక పాలనకు అద్దంపడుతోందని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
- నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..!
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి చెందారు. అసలేం జరిగిందంటే..?
- బిహార్ సీఎంగా నితీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం.. 'డిప్యూటీ'గా తేజస్వీ
జేడీయూ నేత నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిదో సారి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
- ఒకేసారి జాతీయ గీతం పాడిన 16వేల మంది
ఒకేసారి 16వేల మంది విద్యార్థులు కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి.. స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని చాటిచెప్పారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని విద్యార్థులంతా ఒక చోట చేరి.. జాతీయ గీతాన్ని పాడారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
- చైనాలో మరో కొత్త వైరస్.. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి.. టీకాలూ లేవ్!
చైనాలో మరో కొత్తవైరస్ వెలుగులోకి వచ్చింది. జంతువుల నుంచి సోకే హెనిపావైరస్ కేసులు షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావిన్స్‌ల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ నివారణకు టీకాలు లేవు.
- రూ.54వేల కోట్ల టెస్లా షేర్లు విక్రయించిన మస్క్.. కారణం అదే!
టెస్లాలో తనకు ఉన్న షేర్లను ఎలాన్ మస్క్ విక్రయించారు. ఏకంగా 79.2 లక్షల షేర్లు విక్రయించినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ వెల్లడించింది.
- అతడికి నటి పూర్ణ టైట్ హగ్.. 'ఎప్పటికీ నా వాడే' అంటూ..
నటి పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆమె ఈ రూమర్స్‌కు చెక్ పెట్టారు. సోషల్‌మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆమె కాబోయే భర్త్ షానిద్ని గట్టిగా కౌగిలించుకుని సిగ్గుపడుతున్నారు.
- దాదా, అజారుద్దీన్ కాంట్రవర్సీ ట్వీట్స్.. ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్
కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శనపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, మరో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్. దీంతో వారిద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM
.
ఏపీ ప్రధాన వార్తలు