కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఏ ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తీసివేయడం లేదని సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. మే22 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో 19మంది కరోనా బారిన పడ్డారని..సిబ్బంది ఆరోగ్యం భద్రతా దృష్ట్యా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నడవడంలేదన్న ఎండీ..కోవిడ్ వ్యాప్తి నివారణ కోసం అవసరమైన వారిని మాత్రమే విధులకు పిలుస్తున్నామని చెప్పారు. సంస్థలోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిలో ఏ ఒక్కరినీ తొలిగించేది లేదని స్పష్టం చేశారు.
'కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం లేదు' - rtc md prathap latest news
ఆర్టీసీలో ఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తీసివేయమని ఆ సంస్థ ఎండీ స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాధి నివారణలో భాగంగా పరిమిత సంఖ్యలో మాత్రమే విధులకు పిలుస్తున్నట్లు ప్రతాప్ తెలిపారు.