chandrababu and Lokesh Pongal Wishes: తెలుగు ప్రజలంతా.. సంక్రాంతి – భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి.. ప్రతి తెలుగులోగిలిలో కొత్త వెలుగులు నింపాలని కోరుతూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఇది ప్రకృతితో అనుసంధానమైన రైతుల పండుగ.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించి వారి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. తెలుగు ప్రజలంతా ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకోవాలని కోరారు.
ఎన్ని ఇబ్బందులున్నా.. నిరుపేదలు సైతం ఈ పెద్దపండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకను అందజేశామని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. పేదల ఆనందం కోసం కానుకను అందజేసేందుకు వెనుకాడలేదన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కానుకను రద్దుచేయడమేగాక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచారని.. పేదలు కనీసం మూడుపూటలా పొట్టనింపు కోలేని దుస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకోవాలని కోరారు.
లోకేశ్ శుభాకాంక్షలు..
Lokesh Sankranthi festival Wishes: భోగ భాగ్యాలనిచ్చే భోగి, పంటల సిరిసంపదతోపాటు సంతోషాలు తెచ్చే సంక్రాంతి, వ్యవసాయానికి సాయమయ్యే మూగజీవుల్ని పూజించే కనుమ పండగల సందర్భంగా అందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. శుభాకాంక్షలు తెలిపారు. ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఏ దేశమేగినా.. ఖండాంతరాలు ధాటినా.. బంధుమిత్రులతో పండుగను సందడిగా జరుపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి..: PRC: పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదు.. పాత పీఆర్‌సీ అయినా ఇవ్వండి: ఉద్యోగ సంఘాలు