ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తితిదే భూములు వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిరాహార దీక్ష చేయడంపై మంత్రి మండిపడ్డారు. నూజివీడులో 18 ఎకరాల వెంకటాచలం భూములను కన్నా కబ్జా చేశారని.. త్వరలోనే దీన్ని బయటపెడతానని వెల్లడించారు.
తితిదే ఆస్తుల విక్రయంపై గత ప్రభుత్వ హయాంలోని దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసినందుకు కన్నా దీక్ష చేస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఆ పార్టీ తప్పుడు నిర్ణయాన్ని తమకు అంటకట్టవద్దని మంత్రి వెల్లంపల్లి కోరారు.
ఇదీ చూడండి..