ETV Bharat / city

కార్పొరేషన్‌ ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని చెబుతున్నారు: లిడ్​క్యాప్ ఛైర్మన్ - లిడ్​క్యాప్ ఛైర్మన్

రాష్ట్రంలో కార్పొరేషన్‌ ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని అధికారులు చెబుతున్నారని లిడ్​క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులెవవరూ ఛైర్మన్లను లెక్క చేయటం లేదని అన్నారు. ఉత్సవ విగ్రహాలుగా, ఏసీ రూముల్లో కూర్చునేందుకు తాము రాలేదని.., ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే వచ్చామన్నారు.

కార్పొరేషన్‌ ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని చెబుతున్నారు

author img

By

Published : Apr 14, 2022, 6:29 PM IST

కార్పొరేషన్‌ ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని చెబుతున్నారు

రాష్ట్రంలో కార్పొరేషన్​ ఛైర్మన్ల పరిస్ధితిపై లిడ్​క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేషన్​ ఛైర్మన్​లు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని అధికారులు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాకళాక్షేత్రంలో ప్రభుత్వం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అధికారులెవవరూ ఛైర్మన్లను లెక్క చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవ విగ్రహాలుగా, ఏసీ రూముల్లో కూర్చునేందుకు తాము రాలేదని అన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే వచ్చామన్నారు. రాజ్యంగం కల్పించిన ఫలాలు దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందటం లేదన్నారు. పేదవారి కోసం అవసరమైతే చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు.

లిడ్​క్యాప్​లో రూ.కోటి టర్నోవర్ ఉన్న వారికే కాంట్రాక్టు పనులు చేసేందుకు అవకాశం ఉందని.., దీని వల్ల బోర్డులో ఒక్క దళితుడికీ అవకాశం లేని పరిస్ధితి ఉందన్నారు. బోర్డులో దళితులను నియమించాలని తాను పట్టుబట్టడంతోనే దళితులను నియమించారని చెప్పారు. కొందరు ఉన్నతాధికారులు ఛైర్మన్లకు సహకరించటం లేదని.., ఇకపై అలాంటి అధికారుల ఆటలు సాగవని హెచ్చరించారు. చట్టాలని అడ్డుపెట్టుకుని ఎవరికైనా అన్యాయం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

"కార్పొరేషన్‌ ఛైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోవాలని చెప్తున్నారు. ఛైర్మన్లను అధికారులెవరూ లెక్కచేయడం లేదు. ఉత్సవ విగ్రహాలుగా, ఏసీ రూముల్లో కూర్చునేందుకు మేం రాలేదు. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకే వచ్చాం. మా హక్కులు, అధికారాలను వినియోగించుకుంటాం. కొందరు అధికారులు ఛైర్మన్లకు సహకరించడం లేదు. ఇకపై అలాంటి అధికారుల ఆటలు సాగవు." -రాజశేఖర్‌, లిడ్‌క్యాప్‌ ఛైర్మన్

ఇదీ చదవండి: ఎన్టీఆర్ భవన్​లో అంబేడ్కర్ జయంతి.. "దళితుల ప్రతిఘటన" పుస్తక ఆవిష్కరణ..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.