ETV Bharat / city

AP High Court: పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే.. అలా చేయవచ్చు: హైకోర్టు - FIR rejection latest news

పోలీసులు ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ - 2000 ద్వారా ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం కల్పించిన హక్కుల ద్వారా సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని సూచించింది.

పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే.. అలా చెయ్యెచ్చు

author img

By

Published : Feb 5, 2022, 10:16 PM IST

ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 2000 ద్వారా ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అధికరణ 226 కింద హైకోర్టులో రిట్ దాఖలు చేయడానికి వీల్లేదని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే రిట్ దాఖలు చేయడానికి వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్​కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యనించింది.

తమ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఇటీవల పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎస్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. వాటిపై విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం.. కాగ్నిజబుల్ నేరాల విషయంలో ఫిర్యాదు అందితే ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒకవేళ ఎస్ఐఆర్ నమోదు చేయకపోతే మెజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. హైకోర్టు కంటే మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించటం మరింత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమార్గమని స్పష్టం చేస్తూ.. వ్యాజ్యాలను కొట్టేవేసింది.

తన వ్యాజ్యాన్ని కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.నాగమణి అనే పిటిషనర్ ధర్మాసనం ముందు అప్పీల్​కు వెళ్లారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ ..లలిత కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు కాగ్నిజబుల్ నేరాల విషయంలో ఫిర్యాదు అందితే ఎఫ్​ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసిందన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఆసరాగా చేసుకొని పోలీసులు ఫిర్యాదులను తిరస్కరించే ప్రమాదం ఉందన్నారు. దీంతో ప్రజలు న్యాయబద్ధ హక్కును కోల్పోతారని వాదించారు. ఆ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఎఫ్​ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 200, 154(3),156(3) ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని గుర్తుచేస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలంటూ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది.

ఇదీ చదవండి

హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు.. ఉద్యోగ సంఘాల అభ్యంతరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.