రాష్ట్రంలో ఫీవర్ సర్వేను నిరంతర ప్రక్రియగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో కరోనా నియంత్రణ, టెస్ట్ అండ్ ట్రాక్ విధానం కింద వైద్యశాఖ ఇప్పటికే 13 సార్లు ఇంటింటి సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఇళ్లలో ఫీవర్ సర్వే పూర్తి చేశారు.
సర్వే ద్వారా 92,364 మంది కొవిడ్ అనుమానితులను గుర్తించగా..10,729 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా రోగులకు ఉచిత వైద్యసేవలు, మెడికల్ కిట్లు పంపిణీ చేయటంతో పాటు 104 ద్వారా టెలీ కన్సల్టేషన్, ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ చేపట్టారు.
ఇదీచదవండి
Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు