ETV Bharat / city

సీఎంఆర్ గ్రూప్​న​కు సెట్​బ్యాక్ మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు

విశాఖలోని సీఎంఆర్ గ్రూప్​న​కు చెందిన ఆరు ల్యాండ్ పార్సిళ్లలో 25 శాతం మేర సెట్​బ్యాక్ మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మినహాయింపులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సీఎంఆర్ గ్రూప్ విజ్ఞప్తి చేసింది.

set back exemptions to cmr group
సీఎంఆర్ గ్రూప్​కి సెట్​బ్యాక్ మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు
author img

By

Published : Dec 23, 2020, 7:06 PM IST

విశాఖలోని సీఎంఆర్ గ్రూప్​న​కు సంబంధించిన ఆరు ల్యాండ్ పార్సిళ్లలో 25 శాతం మేర సెట్​బ్యాక్ మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేసిన సిఫార్సుల మేరకు సెట్​బ్యాక్ మినహాయింపులు ఇస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె. శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు.

భూమికి బదులు భూమి ప్రాతిపదికన 2018లో రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ గ్రూప్ నుంచి వాల్తేరు రోడ్​లోని 3.40 ఎకరాల భూమిని తీసుకుని దానికి బదులుగా విశాఖలో ఆరుచోట్ల 4.85 ఎకరాలను కేటాయించించింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఆరు ల్యాండ్ పార్శిళ్లలోని సెట్​బ్యాక్ మినహాయింపులతో పాటు అదనపు ఫ్లోర్ నిర్మాణానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలంటూ సీఎంఆర్ గ్రూప్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సులు చేయగా.. ప్రభుత్వం ఈ మినహాయింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

అదనపు నిధుల సమీకరణకు.. రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.