ETV Bharat / city

ఓట్ల లెక్కింపు రోజున ర్యాలీలకు అనుమతి లేదు

ఎన్నికల రోజున జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపుకు పటిష్ఠ భద్రతా చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకున్నామని విజయవాడ సీపీ తెలిపారు.

author img

By

Published : May 17, 2019, 6:15 PM IST

సీపీ ద్వారకా తిరుమలరావు
సీపీ ద్వారకా తిరమలరావు
ఈనెల 23న ఓట్ల లెక్కింపు సందర్బంగా బందోబస్తుపై విజయవాడ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక నగరంలో సున్నిత ప్రాంతాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు నగరంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు. పాత నేరస్థులపైనా ఇప్పటికే బైండోవర్ కేసులు పెట్టామని... వారిపై నిఘా వుంటుందని సీపీ తెలిపారు.

Intro:ap_cdp_17_17_rtc_jac_dharna_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఈనెల 22 తరువాత ఎప్పుడైనా సమ్మె లోకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆర్ టి సి ఐకాస నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో లో భాగంగా కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఐ కా స ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీలో సిబ్బంది కుదింపు చర్యలను విడనాడాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఇ చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అద్దె బస్సుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ బస్సులోనే పెంచాలని, అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు. కార్మికులకు రావాల్సిన 40 శాతం అరియర్స్ వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే 22 తర్వాత ఏ క్షణమైన వెళ్దామని హెచ్చరించారు.

Body:ఆర్టీసీ ఐకాస ఆందోళన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.