ETV Bharat / city

మంత్రివర్గ సమావేశం ప్రారంభం.. రాజీనామా చేయనున్న మంత్రులు !

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కేబినెట్‌ భేటీ తర్వాత ప్రస్తుతమున్న మంత్రులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా సమర్పణకు ఖాళీ లెటర్ హెడ్‌లతో మంత్రులు సమావేశానికి హాజరయ్యారు.

కాసేపట్లో మంత్రి వర్గ సమావేశం
కాసేపట్లో మంత్రి వర్గ సమావేశం
author img

By

Published : Apr 7, 2022, 3:09 PM IST

Updated : Apr 7, 2022, 4:00 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం ఏర్పడిన తొలి కేబినెట్​.. చివరి సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో.. అజెండాలోని 36 అంశాలను చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం 25 మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా సమర్పణకు ఖాళీ లెటర్ హెడ్‌లతో మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. ఇప్పుడున్న మంత్రుల్లో ముగ్గురు లేదా నలుగురిని తిరిగి కేబినెట్​లోకి తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

కేబినెట్ అజెండాలోని ముఖ్యాంశాలు..

  • మిల్లెట్ మిషన్ పాలసీకి ఆమోదం తెలియజేయనున్న కేబినెట్
  • డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
  • డిగ్రీ కళాశాలల్లో 574 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్
  • ఏపీ టూరిజం కార్పొరేషన్‌కు 6 ఎకరాలు ఉచితంగా కేటాయించే ప్రతిపాదన
  • రాజమహేంద్రవరంలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌కు స్థల ప్రతిపాదన
  • ఐదు జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణానికి భూకేటాయింపుల ప్రతిపాదన
  • హెల్త్‌ హబ్‌ పథకం కింద ఆస్పత్రుల నిర్మాణానికి భూకేటాయింపులు
  • ఆస్పత్రులకు భూకేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్‌
  • రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆస్పత్రులు
  • అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో హెల్త్ హబ్ పథకం కింద ఆస్పత్రులు
  • కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పారిశ్రామిక పార్కుకు 82 ఎకరాల కేటాయింపు ప్రతిపాదన
  • రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలపనున్న కేబినెట్
  • కొన్నిచోట్ల మార్పుచేర్పులకు ఆమోదం తెలపనున్న కేబినెట్
  • జడ్పీల కాలపరిమితి ముగిసే వరకు కొనసాగించేందుకు చట్ట సవరణకు నిర్ణయం

ఇదీ చదవండి: నేడు మంత్రుల రాజీనామా.. 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

Last Updated : Apr 7, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.