Antisocial activites at krishna river ghats: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి రోజూ వేల మంది భక్తులు వస్తుంటారు. కృష్ణానది తీరంలో పవిత్ర స్నానాల అనంతరం.. అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఆలయానికి పక్కనున్న రహదారి మార్గం వైపు ప్రభుత్వం ఘాట్లు నిర్మించింది. పిల్లలు, పెద్దలు స్నానాలు ఆచరించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఘాట్లు వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయి. గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు, మందు బాబులు, ప్రేమ జంటలు ఇక్కడ తిష్టవేస్తున్నారు.
కలుషితమవుతున్న నీరు..
కృష్ణా తీరం వెంబడి ఉన్న దుర్గా ఘాట్, దేవీఘాట్, పున్నమి ఘాట్ వద్ద భక్తులు ఎక్కువగా స్నానాలు చేస్తుంటారు. మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులు నదిలో వేస్తుండటంతో నీరు కలుషితమవుతోంది. పలిగిన మద్యం సీసాల వల్ల భక్తులు గాయపడుతున్నారు.
స్థానికుల ఆగ్రహం..
పోలీసుల పర్యవేక్షణ పెంచి ఆకతాయిల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంలో దేవాలయ, పోలీసుల శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:
సర్పంచుల సంఘం ప్రతినిధుల ఆందోళన.. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడి