రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. దేవాదాయశాఖ అన్ని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని గతంలో మాదిరిగానే ప్యాకెట్ల రూపంలో అందజేయాలని ఆదేశించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో.. కోవిడ్ నిబంధనలు సడలించిన అనంతరం రోజుకు 1500 మందికి అన్నదానం చేపట్టారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని.. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అన్నదానం ఆపివేశారు. నేటి నుంచి భక్తులకు.. సాంబారు అన్నం, దద్దోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 4 వేల ప్రసాదం ప్యాకెట్లను అందించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: