ETV Bharat / city

AP Cabinet: కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం..అవి ఏంటంటే..

author img

By

Published : Sep 16, 2021, 2:40 PM IST

Updated : Sep 17, 2021, 4:03 AM IST

కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

14:35 September 16

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
  • పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తున్నాం. అవి చాలవనుకున్న వారిలో డ్వాక్రా మహిళలకు రూ.35వేల ఇంటి రుణం 3% వడ్డీతో ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది.
     
  •  మిగిలిన 6% వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. పరిశ్రమలకు అవసరమైన 40 రకాల కోర్సుల్లో నైపుణ్యశిక్షణ ఇప్పించేందుకు మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 
     
  • రాష్ట్రంలోని 300 పైచిలుకు సాంకేతిక కళాశాలల్లో 1,62,000 మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందిస్తాం. రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సోలార్‌ పార్కు కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) యూనిట్‌ రూ.2.48కే సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని మంత్రిమండలి ఆమోదించింది. 

ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తనఖా పెట్టి రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్‌ నుంచి పేదలు తీసుకున్న ఇంటి రుణాలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. నిర్దిష్ట మొత్తాలు కట్టించుకుని వారిని రుణ విముక్తులను చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఇళ్లు వారి పేరున ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని, అవి వారి సొంత ఆస్తులుగా మారిపోతాయని ప్రకటించింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి యూనిట్‌ రూ.2.48 చొప్పున పదివేల మెగావాట్లు రాష్ట్రం కొనేందుకూ ఆమోదం తెలిపింది. ఇళ్ల నిర్మాణం కోసం డ్వాక్రా మహిళలకు 3% వడ్డీకి రూ.35వేల రుణం, యువతకు నైపుణ్య శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం వంటి అంశాలకూ మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి గురువారం వెలగపూడి సచివాలయంలో సమావేశమయింది. ఎజెండా అంశాలను చర్చించి ఆమోదించింది. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మంత్రిమండలి నిర్ణయాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

* ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్‌లో రుణాలు పొంది బకాయిలు పేరుకుపోయిన వారికి వన్‌టైం సెటిల్‌మెంటు చేయాలని నిర్ణయించాం. పల్లెల్లో రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లించి పూర్తి బకాయిలు, వడ్డీ రద్దు చేయించుకోవచ్చు. 1983 నుంచి 2011 ఆగస్టు 15 మధ్య ఇంటి పట్టాలు తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఆ ఇల్లు, స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. గృహనిర్మాణ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకుని ఆ ఇల్లు వేరేవారికి అమ్మినా ఆ రుణాలు వన్‌టైం సెటిల్‌మెంటు కింద పరిష్కరిస్తాం. అలాంటివారికి వేరే ఇల్లు లేదని, అర్హులేనని తేలితే వారి నుంచి కూడా కొంతమొత్తం కట్టించుకుని రుణ విముక్తులను చేస్తాం. ఇలాంటివారు గ్రామాల్లో రూ.20 వేలు, మున్సిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్‌లలో రూ.40 వేలు చెల్లించాలి. హౌసింగు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకోకుండా ఇళ్లు కట్టుకున్నవారికీ ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తుంది. అలాంటి స్థలాన్ని, ఇంటిని వేరేవారికి అమ్మితే వారూ గ్రామాల్లో రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లించి హక్కులు పొందవచ్చు. దీని వల్ల 46 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా. ఈ స్కీం వల్ల అసలు రూపంలో రూ.9,320 కోట్లు, వడ్డీ రూపంలో రూ.5,289 కోట్లు మొత్తం రూ.14,609 కోట్లు మాఫీ అయిపోతాయి. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 15 లోపు వినియోగించుకోవాలి. 2021 డిసెంబరు 21న ఆ ఇళ్లు, స్థలాలు వారి పేరున బదిలీ అవుతాయి.

రెండోవిడత ఆసరాకు ఆమోదం

రెండోవిడత ఆసరా నిధులు చెల్లింపునకు మంత్రిమండలి ఆమోదించింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకుల్లో ఉన్న రుణాల మొత్తాలను రూ.27,168.83 కోట్లు నాలుగు విడతలుగా వారికి అందిస్తామని హామీ ఇచ్చాం. తొలి విడతగా ఆసరా కింద ఆ నిధులను రూ.6,318 కోట్లు చెల్లించాం. రెండోవిడత ఆసరా చెల్లింపులు రూ.6,470.76 కోట్లు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదించింది.

స్కూళ్లు, ఆస్పత్రులకు దాతల పేర్లు

రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లలో వసతులు మెరుగుపరుస్తున్నాం. ఎవరైనా దాతలు ఈ కార్యక్రమానికి నిధులిస్తే ఆ పాఠశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు వారు సూచించిన పేర్లు పెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. శాటిలైట్‌ స్కూళ్లకు రూ.50 లక్షలు, ఫౌండేషన్‌ స్కూళ్లకు రూ.కోటి, ఉన్నత పాఠశాలలకు. రూ.5 కోట్లు దానం చేస్తే వారి పేర్లు పెడతాం. పీహెచ్‌సీకి రూ.కోటి, సీహెచ్‌సీకి రూ. 5 కోట్లు, ఏరియా ఆస్పత్రికి రూ.10 కోట్లు ఇస్తే వారి పేర్లు పెడతాం. కళాశాల, స్కూలులో తరగతి గది లేదా అదనపు గది, హాస్టల్‌, లైబ్రరీ, డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తే ఆ నిర్మాణాలకు 20 ఏళ్లపాటు దాతల పేర్లు పెట్టాలని నిర్ణయించాం.
* ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఉప ప్రణాళిక తరహాలోనే మైనారిటీ ఉప ప్రణాళిక అమలు చేస్తాం.                  
 
*రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు

 గుంటూరు జిల్లా పశ్చిమ మండలం అడవితక్కెళ్లపాడులో షటిల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు, క్రీడా ప్రాంగణం నిర్మాణానికి రెండు ఎకరాలు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రముఖ క్రీడాకారుడికి ఈ భూమి కేటాయించినట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఎకరాకు రూ.1.20 కోట్లకు ఈ భూమి ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరికొన్ని ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి...

  • విశాఖ జిల్లా అరకు మండలం మజ్జివలసలో ఏకలవ్య మోడల్‌ స్కూలు నిర్మాణానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి గిరిజన సంక్షేమశాఖకు బదలాయించేందుకు ఆమోదం.
  •  చిత్తూరు జిల్లా యాదమర్రిలో 2.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐఓసీ, ఐవోసీఎల్‌ టెర్మినల్‌ నిర్మాణం కోసం ఎకరా రూ.30 లక్షలకు ఇచ్చేందుకు నిర్ణయం.
  •  కడప జిల్లా రాయచోటి మండలం మాసాపేటలో యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెంటర్‌ ఏర్పాటుకు 53.45 ఎకరాల కేటాయింపు.
  •  కడప జిల్లా పుట్లంపల్లిలో ఎల్‌వి ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ఏర్పాటుకు 4.59 ఎకరాల కేటాయింపు.
  •  గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లిలో 223 ఎకరాల భూమి ఏపీఎండీసీకి బదలాయించేందుకు నిర్ణయం. ఆ భూమి అనుభవదారులకు నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం. అక్కడ ఉన్న రైతులందరికీ మార్కెట్‌ ధర ప్రకారం సొమ్ములు చెల్లించిన తర్వాత, వారు అంగీకరించాకే భూమి బదలాయించాలని నిర్ణయించారని మంత్రి నాని వెల్లడించారు.
  •  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ మున్సిపాలిటీలో 31 సెంట్ల భూమిని కమ్యూనిటీ హాలు, విద్యాసంస్థ నిర్మాణానికి మైనారిటీ సంక్షేమశాఖకు ఇచ్చేందుకు నిర్ణయం.
  • శ్రీశైలంలో జగద్గురు పండితారాధ్య సేవాసమితి ట్రస్టుకు 10 ఎకరాల భూమి 33 ఏళ్ల లీజుకు గజం రూ.10వేలకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం. ప్రతి మూడేళ్లకు 30% పెరగనున్న లీజు ధర. స్కూలు, అన్నదాన సత్రం, ఆస్పత్రుల నిర్మాణానికి ఈ భూమి కేటాయింపు.
  •  ఏపీ ఫోస్టర్‌ కేర్‌ మార్గదర్శకాలు 2021కి మంత్రిమండలి ఆమోదం. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం 2015కి మార్గదర్శకాలు. తల్లిదండ్రులు శారీరక, మానసిక అనారోగ్యంతో ఉండి పిల్లల సంరక్షణ చేపట్టలేని స్థితిలో ఉంటే ఆ పిల్లలను సంరక్షకులకు అప్పగించే విషయంలో మార్గదర్శకాలకు ఆమోదం. సంరక్షకుల సమర్థత, ఉద్దేశం, సామర్థ్యం, పిల్లల సంరక్షణలో వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శకాలు.
  •  రాయలసీమ కరవు నివారణలో భాగంగా హంద్రీనీవా రెండో దశలో పుంగనూరు బ్రాంచి కాలువ విస్తరణ పనులు రూ.1,929 కోట్లతో చేపట్టేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల నుంచి సడలింపు. కాలువ 79.6వ కిలోమీటరు నుంచి 220.35వ కిలోమీటరు వరకు విస్తరణ పనులు. దీనివల్ల తంబళ్లపల్లి, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తాగునీటి వసతి కల్పనకు అవకాశం.
  •  వైఎస్సార్‌ కాశినాయన మండలంలో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుస్టేషన్‌ ఏర్పాటుకు ఆమోదం. ఎస్సై, ఇద్దరు ఏఎస్‌ఐలు, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు, అయిదుగురు ఔట్‌సోర్సింగు సిబ్బంది, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక స్వీపర్‌ పోస్టు మంజూరుకు ఆమోదం.
  •  సీఐడీ డిపార్టుమెంట్‌లో అదనపు హోంగార్డు పోస్టుల మంజూరుకు ఆమోదం.
  •  శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తోగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం.
  •  ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం. రాష్ట్రంలో సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ అథారిటీ కృషిచేస్తుంది. ఈ సంస్థకు ఏడాదికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1.50 కోట్లు మంజూరు, గతంలో ఈ సర్టిఫికేషన్‌ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోనే ఆ అవకాశం.

ఇదీ చదవండి

High Court: పరిషత్‌ పోరు ఫలితాల వెల్లడికి హైకోర్టు పచ్చజెండా

Last Updated : Sep 17, 2021, 4:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.