రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీ
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్సై పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం!
ఎస్సై పిలుస్తున్నాడంటూ ఓ అగంతకుడు.. యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసులు
అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 15 రోజుల క్రితం 8 మందిలో వ్యాధి లక్షణాలు కనిపించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 64కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పెరిగిన పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. లీటర్ పెట్రోల్ రూ.100.12, డీజిల్ రూ.94.44గా ఉంది. లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.103.58 అయింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.99.92, డీజిల్ రూ.94.24 ఉండగా.. ప్రీమియం పెట్రోల్ రూ.103.38కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
1.73 లక్షల కొత్త కేసులు
దేశంలో కొత్తగా 1.73 లక్షల మందికి వైరస్(Covid cases in India) నిర్ధరణ అయింది. మరో 3,617 మంది కొవిడ్‌తో(covid-19) మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,22,512కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'నారదా కేసులో నవ్వుల పాలయ్యాం
నారదా కేసులో(narada case) నిందితులకు బెయిల్ మంజూరు చేసే విషయమై అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని జస్టిస్ అరిందమ్ సిన్హా తప్పుబట్టారు. ఇలా చేయడం ద్వారా నవ్వుల పాలయ్యామని అభిప్రాయపడుతూ న్యాయమూర్తులకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత దృఢం
భారత్, అమెరికా మధ్య జరిగిన చర్చలతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దృఢంగా మారిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో సమావేశమయ్యారు. కరోనాపై పోరులో భాగంగా భారత్‌కు అమెరికా అందించిన సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
15వ సారి ఇంధన ధరలు పెరిగాయి
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.93.94కి చేరింది. ఒక్క మే నెలలోనే 15 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
అశ్విన్ ఫస్ట్‌బెంచ్ స్టూడెంట్: జాఫర్
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(World Championship Final) మ్యాచ్‌కు సంబంధించిన విధి విధానాలను ఐసీసీ విడుదల చేసింది. దీనిపై టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వసీమ్ జాఫర్ తనదైన శైలిలో ఓ మీమ్ ద్వారా స్పందించి అందరినీ ఆకట్టుకున్నాడు. అశ్విన్‌ను ఫస్ట్‌బెంచ్ స్టూడెంట్‌గా అభివర్ణిస్తూ ట్రోల్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
hanuman: టాలీవుడ్ తొలి సూపర్ హీరో చిత్రం
విభిన్న చిత్రాలతో అలరిస్తోన్న ప్రశాంత్ వర్మ మరో కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు. టాలీవుడ్లోనే తొలి సూపర్ హీరో నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..