కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతపై ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉందనే అంశంపై విజయవాడ ఆంధ్రా లయోల కళాశాల సర్వే చేపట్టింది. జూన్ 4 నుంచి జులై 4 వరకు ఆన్‌లైన్ వేదికగా.... నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,960 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. కరోనా వైరస్ ఎలా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందనే అంశంపై 92.10 శాతం మందికి అవగాహన ఉన్నట్టు తేలింది. కానీ... అది ఏయే పద్ధతుల్లో ఎంత మందికి ప్రమాదకరంగా మారుతుందనే విషయాన్ని మాత్రం కేవలం 45.20 శాతం మంది చెప్పగలిగారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు పనితీరుపై 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా... ప్రభుత్వేతర సంస్థలు కూడా సహాయమందిస్తున్నాయని 60 శాతం మంది వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలతో వైరస్ నియంత్రించవచ్చనే అభిప్రాయానికి 72 శాతం మంది మద్దతు పలికారు.
విభాగం రూపొందించిన ప్రశ్నావళిని తమ తమ పరిధిలోని వారికి ఆన్లైన్లో పంపి.. అభిప్రాయాలు సేకరించటంలో విద్యార్థులూ తమ వంతు సహకారం అందించారు. ఎన్నో ఆసక్తికర అంశాలను ఈ సర్వే ద్వారా తెలుసుకోగలిగామని చెప్పారు.
పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే... వైరస్ వ్యాప్తిని మరింత అరికట్టవచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కొద్దిపాటి జాగ్రత్తల పాటిస్తే మహమ్మారి నుంచి కాపాడుకోగలమని అంటున్నారు సర్వే నిర్వాహకులు.
ఇదీ చదవండి: