విజయవాడ నగర శివారులో నున్న బైపాస్ రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్ధి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న బైక్లు ఒక దానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వీరు అడవినెక్కళంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రవేశ పరీక్ష రాసి వస్తుండగా..ఈ దుర్ఘటన జరిగింది. నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: