ETV Bharat / city

'వైకాపా పాలనలో ఏ సామాజికవర్గం కూడా సంతోషంగా లేదు'

రాష్ట్రంలో మహిళలు, బహుజనులకు రక్షణ లేకుండా పోయిందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద మహిళపై అత్యాచారం జరిగినా... చర్యలు శూన్యమని మండిపడ్డారు. ఈ విషయంపై రేపు విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన చేపడతామన్నారు.

అమరావతి బహుజన జేఏసీ
అమరావతి బహుజన జేఏసీ
author img

By

Published : May 15, 2022, 4:37 PM IST

రాష్ట్రంలో మహిళలు, బహుజనులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. రేపు విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన దీక్ష చేపడుతున్నామని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ముఖ్యమంత్రి నివాసం వద్ద మహిళపై అత్యాచారం జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

వైకాపా పాలనలో ఏ సామాజికవర్గం కూడా సంతోషంగా లేదని పోతుల బాల కోటయ్య విమర్శించారు. దిశ అనేది చట్టం కాదు యాప్ మాత్రమేనని... దాన్ని పక్కనపెట్టి మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఈ రాష్ట్రాన్ని కాలకేయుల పాలన నుంచి కాపాడడానికి ప్రజలంతా ఏకం కావాలన్నారు

ఇదీ చదవండి: APMDC: 'ఎవరికి సబ్ లీజుకు ఇచ్చారనేది ప్రభుత్వానికి అనవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.