హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భాజపా నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై రమేశ్ కుమార్ ఎందుకు నోరు విప్పడంలేదని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వీరి భేటీ అనైతికమని, దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
సుజనా, శ్రీనివాస్ ఇద్దరూ భాజపాలో ఉన్న తెదేపా సానుభూతిపరులని, వీరితో భాజపా నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిద్దరూ భాజపాలో ఉంటూ తెదేపా కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే ఆ ముగ్గురూ భేటీ అయ్యారన్నారు.
ఇవీ చదవండి....
పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు