ఏఎంఆర్డీఏ కమిషనర్ ఛాంబర్(Amaravati farmer suicide attempt at AMRDA Commissioner's Chamber) ఎదుట అమరావతి ప్రాంతానికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ల్యాండ్ పూలింగ్‌కు సంబందించిన బెనిఫిట్లు ఇవ్వడంలేదంటూ.. రాజధాని ప్రాంతానికి చెందిన సుబ్బారావు అనే రైతు.. ఏఎంఆర్డీఏ కమిషనర్ ఛాంబర్ ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Amravati farmer suicide attempt) పాల్పడ్డారు. అధికారుల ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గవర్నర్‌పేట పోలీసులు.. సుబ్బారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన రైతు సుబ్బారావుకు తుళ్లూరు మండలం మందడం గ్రామంలో పొలం ఉంది.ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తన పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన బెనిఫిట్లు రాకపోవడంతో కొద్ది రోజులుగా ఏఎంఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయను.. రాత్రి 7 గంటల సమయంలో కార్యాలయానికి వెళ్లారు. ఏఎంఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ చాంబర్ ఎదుట డీజిల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న గవర్నర్‌పేట పోలీసులు.. హుటాహుటిన కార్యాలయంలోకి చేరుకున్నారు. సుబ్బారావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ.. ఏఎంఆర్డీఏ కమిషనర్ కార్యాలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..
RRR: 'వైకాపా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తే జగన్‌పై పోటీ చేస్తా'