సీపీఎస్ రద్దు సహా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని అమరావతి ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దుకై లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని ఐకాస నేతలు బొప్పరాజు, వైవీరావు అన్నారు. తమ డిమాండ్లను వివిధ సందర్భాల్లో సీఎం జగన్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల డిమాండ్ల సాధనలో అమరావతి జేఏసీ నాయకత్వం ఎప్పుడూ ముందుంటుందని నేతలు తెలిపారు. సీఎం జగన్ సానుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తారనే నమ్మకం, సంపూర్ణ విశ్వాసం ఉన్నాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీచదవండి