ETV Bharat / city

కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో 99 శాతం నీటి నిల్వ - ఏపీలో రిజర్వాయర్లు ఫుల్

వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 108 రిజర్వాయర్లలో దాదాపు అన్నీ 99 శాతం మేర నిండినట్టు జలవనరులశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లలోనూ 870 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 తేదీ నుంచి 4960 టీఎంసీలతో సమానమైన వర్షం రాష్ట్రంలో కురిసినట్టు అంచనా. జూన్ నుంచి కురిసిన వర్షాలకు రిజర్వాయర్లలో నీటి నిల్వ ఉంచినప్పటికీ చాలా నీళ్లు సముద్రంలోకి వదిలారు. ఒక్క కృష్ణా నది నుంచే దాదాపు వెయ్యి టీఎంసీల వరకూ నీరు సముద్రం పాలైంది.

reservoirs full with water
కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో 99 శాతం నీటి నిల్వ
author img

By

Published : Oct 22, 2020, 3:39 PM IST

భారీ వర్షాల కారణంగా ఈసారి రాష్ట్రంలోని రిజర్వాయర్లు, ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 108 రిజర్వాయర్లలో ఎక్కువ శాతం మేర 99 శాతం నీటిని నిల్వ చేసినట్టు జలవనరుల శాఖ వెల్లడించింది. అయితే కొన్నింటిలో 40శాతం నీటిని కూడా నిల్వ చేయలేకపోయారు. ప్రస్తుత నిల్వ సామర్ధ్యం ప్రకారం రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో 870.25 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్టు తెలుస్తోంది.

జూన్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,960 టీఎంసీలతో సమానమైన వర్షం కురిసినట్టు అంచనా వేస్తున్నారు. 2019లో అన్ని రిజర్వాయర్లలోనూ 802 టీఎంసీల మేర మాత్రమే నీటిని నిల్వ చేయగలిగారు. ప్రస్తుతం 70 టీఎంసీల మేర అదనంగా నీటి నిల్వ చేయగలిగినా.. ఇంకా అన్ని రిజర్వాయర్లలోనూ మరో 112 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే అవకాశముంది.

నిండుకుండల్లా ప్రాజెక్టులు

శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్ధ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 215.66 టీఎంసీల మేర అంటే 99.93 శాతం నీటి నిల్వ ఉన్నట్టు జలవనరుల శాఖ స్పష్టం చేసింది. నాగార్జున సాగర్​లోనూ 312 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా.. పూర్తిగా నీరు నిల్వ చేశారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నిల్వసామర్ధ్యం ఉంటే ప్రస్తుతం 43.93 టీఎంసీల మేర నీటిని నిల్వ ఉంచారు. ఇక గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​లో12.44 టీఎంసీలకు గానూ 80 శాతం మేర నింపి 10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. గాజుల దిన్నెలో 96 శాతం రిజర్వాయర్​ను నింపి 4.36 టీఎంసీలను నిల్వచేశారు. బుగ్గవాగు 3.29 టీఎంసీలతో 95 శాతం మేర నిండుగా ఉంది. ప్రకాశం బ్యారేజి 3.07 టీఎంసీలతో 100 శాతం నిండుగా ఉంది.

చెరువులు కళకళ

సుంకేశుల, ఏలేరు రిజర్వాయర్లలో 23 టీఎంసీలతో, గోనేలవాగు రిజర్వాయర్, గుండ్లకమ్మ, కాటన్ బ్యారేజీ, ఎర్రకాలవ,తోటపల్లి, గొల్లాపల్లి, గొట్టా బ్యారేజీ, వరహా, బహుదా, గండికోట, చిత్రావతి తదితర మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల్లోనూ దాదాపు 70 నుంచి 100 శాతం మేర నీటిని నిల్వ చేశారు. గోదావరి బేసిన్​లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు మడ్డిగెడ్డ, విజయరాయితో పాటు.. పెన్నా నది బేసిన్​లో ఉన్న పైడిపాలెం, మైలవరం, వెలిగల్లు, సర్వారాజసాగర్, చెర్లోపల్లి, సంగం బ్యారేజి లాంటి చోట్ల 50శాతం సామర్ధ్యం కంటే తక్కువస్థాయిలో నీటి నిల్వ ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, ఇతర నీటి వనరుల్లో 99.86 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగారు. జియో ట్యాగ్ చేసిన 37,256 చెరువుల్లో ప్రస్తుతం సగం మాత్రమే నింపగలిగారు. ఇక ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి కురిసిన వర్షాల కారణంగా కృష్ణా నది నుంచి వెయ్యి టీఎంసీల మేర, గోదావరి నది నుంచి 1400 టీఎంసీల మేర నీరు సముద్రంలో కలిసింది.

ఇవీ చదవండి..

వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ రూ.5 కోట్ల సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.