బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు, వైకాపా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్ర బ్యాంకు విలీనాన్ని ఆపాలనే డిమాండ్ తో అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. రాజకీయ మధ్యవర్తిత్వం ద్వారానే విలీన ప్రక్రియను అడ్డుకోవచ్చనీ, అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ అంశంలోనూ రాష్ట్రానికి న్యాయం జరగలేదని సీపీఐ రామకృష్ణ అన్నారు. బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి..